in

‘baby’ girl vaishnavi chaitanya getting crazy offers!

బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. చిన్న సినిమాగా వచ్చిన బేబీ భారీ హిట్ సాధించింది. అవార్డ్స్, రివార్డ్స్ కూడా అందుకుంది బేబీ మూవీ. ఈ సినిమా తరువాత వైష్ణవీ చైతన్య ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. కానీ బేబీ తరవాత ఒకే ఒక్క సినిమాతో వచ్చి డిజాస్టర్ చూసింది. మళ్ళీ ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది వైష్ణవి. ప్రస్తుతం తెలుగులో ఆనంద్ దేవరకొండతో ఒక మూవీ, సిద్దు జొన్నలగడ్డ తో ‘జాక్’ మూవీ చేస్తోంది. ఇవి కాక తమిళం, మలయాళం, కన్నడ నుంచి కూడా అవకాశాలు వస్తున్నట్టు సమాచారం.

తెలుగు అమ్మాయిలకి టాలీవుడ్ లో ఛాన్స్ లు రాకపోయినా మిగతా భాషల్లో సత్తా చాటి పేరు తెచ్చుకున్నవారు కొందరు ఉన్నారు. ఇపుడు ఈ లిస్ట్ లో వైష్ణవీ కూడా చేరుతోంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు సౌత్ లో బిజీగా హీరోయిన్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బేబీ మూవి కంటే ముందు ‘అలవైకుంట పురం’ సినిమాలో నటించింది. తమిళంలో అజిత్ సినిమాలో నటించింది. కానీ బేబీ సినిమా గుర్తింపుతో పాటు ఫిలిం ఫేర్ కూడా అందించింది. ఇప్పుడు కోలీవుడ్ లో హీరోయిన్ గా రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం..!!

23 years for ‘nuvvu leka nenu lenu’!

icon star allu arjun to team up with koratala siva?