నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టయింది. విలేజ్ డ్రామా కాన్సెప్ట్‌తో మంచి కుటుంబ కథగా ప్రేక్షకులను మెప్పించింది. తొలి సినిమాతోనే సైమా బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ అవార్డు కూడా దక్కించుకుంది. తనను కాపాడతాడని ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తనను రక్షించాల్సిన బాడీగార్డు తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఓ ఈవెంట్లో బాడీగార్డు తనను దారుణంగా తాకాడని అవికాగోర్ తన అనుభవాలు వివరించింది..
అయితే రెండు సార్లు అతడు నాతో అలాగే ప్రవర్తించాడని, ఆ సమయంలో అతినిని చూసి గట్టిగా ఏంటని అడగ్గా, అప్పుడు సారీ చెప్పాడు.ఇక ఆ సమయంలో సంఘటనని వదిలేశాను . అలా ప్రవర్తించినప్పుడు అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ని వారికి తెలియదని.. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి చాలా మందిని కొట్టేదానిని అంటూ అవికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..!!