in

AR Rahman composes music, Gautam Menon directs bathukamma song!

తెలంగాణలో ప్రతి ఎడాది బతుకమ్మ సంబరాల్లో భాగం ఒక కొత్త పాటను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి ఎడాది లాగే ఈ సారి కూడా బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సారి బతుకమ్మ పాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఎడాది బతుకమ్మ పాటకు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్‌ సమీపంలోనే భూదాన్‌ పోచంపల్లిలో చిత్రీకరణ జరుపుకుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత ఈ పాటను విడుదల చేయనున్నారు. అంతేగాక ఈ సాంగ్‌ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎడాది అక్టోబర్‌ 6 నుంచి బతుకుమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి.

nagarjuna nu pelli chesukune chance miss ayina sumalatha!

Akhil Akkineni says costar Pooja Hegde Is Really A Workaholic!