in

Akhil Akkineni says costar Pooja Hegde Is Really A Workaholic!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

పూజాహెగ్డే పై అఖిల్ అక్కినేని ప్రశంసలు కురిపించారు. పూజాహెగ్డే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌లలో 6 సినిమాలలో నటిస్తున్నారనీ ,ఈ చిత్రాల షూటింగ్ కోసం ఒక ప్ర‌దేశం నుంచి ఇంకో ప్రాంతానికి ప్ర‌యాణిస్తూనే ఉంటారనీ, పూజాహెగ్డే వ‌ర్క్‌హాలిక్‌అనీ , పూజాహెగ్డే చాలా క‌ష్ట‌పడే త‌త్వం క‌లిగి ఉన్నారనీ అఖిల్ పూజాహెగ్డే ను ప్రశంసించారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ లో స్టాండప్ కమెడియన్ గా ఛాలెంజింగ్ పాత్రలో నటించారనీ, కామెడీ స‌న్నివేశాల్లో చాలా ప్యాష‌న్ తో ప్రేక్ష‌కులకు కొత్త అనుభూతి క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారనీ , సెట్స్ లో పూజాహెగ్డే చాలా చురుకుగా ఉంటూ, త‌న చుట్టూ ఉన్న వారిలో ఎన‌ర్జీ నింపుతూ త‌న పాత్ర‌కు మ‌న‌సు పెట్టి న్యాయం చేశారనీ అఖిల్ చెప్పారు.

AR Rahman composes music, Gautam Menon directs bathukamma song!

telugu girl ritu varma cute photoshoot!