in

Youtuber and bigg boss fame Gangavva bags a crazy offer?

చిరంజీవి సినిమాకి సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘గాడ్‌ఫాదర్’మూవీ గురించిన ఓ వార్త కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి తల్లిగా గంగవ్వ నటించబోతోందనేదే ఆ న్యూస్. ఈ పాత్రకి స్వయంగా మెగాస్టారే ఆమె పేరును సూచించారట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ, బిగ్‌బాస్‌ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో అడుగు పెట్టింది.  చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. రాజరాజ చోర, లవ్‌ స్టోరీ వంటి హిట్‌ చిత్రాల్లో కనిపించింది.

మరికొన్ని అవకాశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఈమధ్య టీవీ షోస్‌లోనూ తెగ సందడి చేస్తోంది. కాబట్టి చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ‘గాడ్‌ఫాదర్’ అనేది మలయాళ సూపర్‌‌ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ఒరిజినల్‌లో మోహన్‌ లాల్ తల్లి పాత్ర అసలు ఉండనే ఉండదు. మరి గంగవ్వను తీసుకోవడమేంటి అనేది పెద్ద డౌట్. దర్శకుడు మోహన్‌ రాజా ఈ స్క్రిప్ట్‌ని మన నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టు మార్చేశాడని, ఒరిజినల్‌లో లేని హీరోయిన్‌ క్యారెక్టర్‌‌ని యాడ్ చేశారని, ఆ పాత్ర అనుష్క చేయబోతోందని..ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆయన తల్లి పాత్రని కూడా యాడ్ చేసి ఉండొచ్చు.

MasterChef host Tamannah replaced, Reason Anasuya Bharadwaj!

payal rajput stills from an interview!