in

ap minister Roja interesting comments on mahesh babu’s movie offer!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలామంది హీరోయిన్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంటే మరికొంతమంది రాజకీయాలలో కూడా రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీని వదిలి ప్రస్తుతం రాజకీయాలలో ఒక వెలుగు వెలుగుతున్న వారిలో మంత్రి రోజా ఒకరు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి, టాలీవుడ్ సీనియర్ నటి రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోయిన్గా నటించిన రోజా ఆ తర్వాత..రాజకీయాలలోకి వచ్చింది. మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన రోజా..ఆ తర్వాత వైసిపి పార్టీ తరఫున నగరి ఎమ్మెల్యేగా గెలిచింది.

అయితే ఏపీలో జరిగిన కేబినెట్ పునవ్యవస్థీకరణ లో భాగంగా ఇటీవల రోజాకు మంత్రి పదవి దక్కింది. దీంతో జబర్దస్త్ కూడా గుడ్ బై చెప్పి రాజకీయాలపై ఫోకస్ చేశారు రోజా. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు లాంటి హీరో సినిమాలో నటించాలని తనకు ఆశగా ఉందని.. కానీ ఆయనకు తల్లిగా పాత్ర వస్తే అస్సలు చేయబోనని వెల్లడించారు రోజా. కానీ మహేష్ బాబుకు అక్కగా లేదా వదినగా ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని రోజా చెప్పుకొచ్చారు..!!

Mehreen Pirzada Upset Over Marital Rape Scene said As ‘romantic Scene’!

Bhagavanth Kesari