అనుష్క పెళ్లి వార్తలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తన పెళ్లి గురించి అనుష్క ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రశ్నలు ఆగడం మాత్రం మానడం లేదు. తాజాగా అనుష్కకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న మరోమారు ఎదురైంది. దీనిపై స్పందించిన అనుష్క.. తాను వివాహ వ్యవస్థను నమ్ముతానని తెలిపింది. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే వివాహ విషయంలో తనకు తొందర లేదని..
తనకు నచ్చినవాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకుంటానని అనుష్క తెలిపింది.కాగా.. తనకు 20 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడే తల్లిదండ్రులు పెళ్లి గురించి ఒత్తిడి చేశారని వెల్లడించింది. అయితే ప్రస్తుతం వారి ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని అనుష్క వెల్లడించింది. కాగా.. ఇటీవలే ‘నిశ్శబ్దం’ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమాలో అనుష్క ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు అనుష్క నటనే హైలైట్‌గా నిలిచింది.