ఈసినిమాకు సీక్వెల్గా టిల్లు square తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీపావళికే ఈ సినిమా నుంచి ప్రకటన రాగా.. అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వెల్లడించింది. అయితే ఇంతలోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుపమ ప్రాజెక్టు నుంంచి వైదొలిగిందని వదంలు వ్యాపించాయి..దీంతో ఆమె స్థానంలో పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
హిట్-2తో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరీ ఎంపికైందని, ఆ తర్వాత ఆమె కూడా సినిమా నుంచి వైదొలిగిందని ఊహాగానాలు వచ్చాయి. ఆమె స్థానంలో శ్రీలీల పేరు కూడా వినిపించింది. కానీ ఆమె కూడా తప్పుకుందని సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరనే హీరోయిన్గా చేస్తున్నట్లు స్పష్టత వచ్చింది. ఆమె చేసిన పోస్టుతో అన్ని వార్తలకు చెక్ పడినట్లయింది..!!