in

ANR 100: Akkineni Nageswara Rao’s timeless classics re-release

సినిమా తపన ఉన్న ANR ని మరొకసారి స్మరించుకుంటూ  టాప్‌ 10 మూవీస్ ని సెప్టెంబర్‌ 20 నుంచి 22వ తేదీ వరకు  రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25 సిటీల్లో రీ రిలీజ్ చేయనున్నారు. సింగిల్ స్క్రీన్‌ థియేటర్ ల్లోనే కాకుండా మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఈ టాప్ 10 సినిమాలను రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ. ఇందుకోసం ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలైన  ఐనాక్స్, పీవీఆర్‌ లతో చర్చలు జరిపినట్లు టాక్.

అయితే రీరిలీజ్ కి రెడీ అయిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యింది. దేవదాసు, మాయాబజార్‌, మిస్సమ్మ, డాక్టర్‌ చక్రవర్తి, భార్యభర్తలు, గుండమ్మ కథ, ప్రేమ్‌ నగర్‌, ప్రేమాభిషేకం, సుడిగుండాలు తో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన చివరి చిత్రం మనం కూడా ఉండటం విశేషం. శతజయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని కూడా రీరిలీజ్ ట్రెండ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక నుంచి పాతతరం హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ కి నోచు కుంటాయేమో చూడాలి..!!

Balakrishna’s son cinema entry, NTR’s Wishes To Mokshagna!

jailer villain Vinayakan arrested in Hyderabad airport!