1999 లో వచ్చిన సుల్తాన్ సినిమా లో ముగ్గురు కృష్ణులు నటించటం జరిగింది, హీరో అండ్ విలన్ రోల్ లో బాలకృష్ణ గారు, పోలీస్ ఆఫీసర్ రోల్ లో కృష్ణ గారు, సి.బి.ఐ. ఆఫీసర్ రోల్ కృష్ణం రాజు గారు నటించటం జరిగింది. ఆ సినిమా షూటింగ్ కోసం అండమాన్ దీవులకు వెళ్లారు అందరు, ఎలాగూ టూరిస్ట్ ప్లేస్ కదా అని ముగ్గురు తమ భార్యలను కూడా తీసుకొని వెళ్లారట. ఆ రోజుల్లో అక్క్కడ పెద్ద హోటళ్లు లేవు, అక్కడ ఉన్న ఒకే ఒక్క గెస్ట్ హౌస్లోనే అందరు సర్దుకున్నారు.
అక్క్కడ తినటానికి ఏమి దొరకక ఇంటినుంచి తీసుకెళ్లిన చిరుతిళ్ళు, బిస్కెట్లతో ఒక పూట గడిపేసి, తరువాతి పూటకు అక్కడ మార్కెట్ లో దొరికిన కూరగాయలతో వంట చేసుకున్నారు. మన బాలయ్య బాబు సముద్రంలో కొన్ని చేపలు పట్టి తీసుకొని వస్తే, విజయ నిర్మల గారు చేపల పులుసు చేశారట, చేపల పులుసు అద్భుతం గ రావటం తో, వీరు తిని మిగతా చేపల పులుసు షూటింగ్ స్పాట్ కి తీసుకొని వెళ్లి మిగతా యూనిట్ సభ్యులకు కూడా వడ్డించారట. ఎంతయినా బాలయ్య బాబు ఎక్కడ ఉన్న తన స్టైల్ లో అందరి బాగోగులు చూసుకోవటం విశేషం..