సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అప్పట్లో మీటూ ఉద్యమాన్ని కూడా బాగానే నడిపారు. టాలీవుడ్‌లోనూ మీటూ ఉద్యమం వల్ల ప్రకంపనలు మొదలయ్యాయి. కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేదు. ఎంత ఉవ్వెత్తున ఉద్యమం లేచిందో.. అంత తొందరగా చల్లారి పోయింది. అయితే ఇలాంటి వేధింపులు కామన్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే కొందరు నోరు విప్పుతారు.. ఇంకొందరు లోలోపలే దాచుకుని బయటకు చెప్పకుండా కుమిలిపోతారు. తాజాగా యాంకర్ వర్షిణి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొందట. తనకు ఈ మద్యే ఓ చేదు అనభం ఎదురైందని చెప్పుకొచ్చింది. అయితే ఇంత వరకు అది ఎవ్వరికీ చెప్పలేదని, అమ్మకు చెబితో కంగారు పడుతుందని బయట పెట్టలేదని తెలిపింది.
అలా మొదటి సారిగా ఈ ఘటన గురించి బయటకు చెబుతున్నానని కాస్త సందేహ పడుతూనే అసలు సంగతి బయటకు చెప్పేసింది. కరోనా కంటే ముందు అంటే ఓ ఐదారు నెలల క్రితం ఈ ఘటన జరిగిందట. ఓ డైరెక్టర్ వెబ్ సిరీస్ కోసం ఆఫీస్‌కు రమ్మన్నాడట. తీరా వెళ్లాక కథ చెప్పాడట. కొద్ది సేపు బాగానే మాట్లాడట. కానీ ఒక్కసారిగా చేయి పట్టి లాగాడు.. తన వైపుకు బలంగా లాగాడాట. ఆ ఘటనతో ఒక్కసారిగా షాకైన వర్షిణి బయటకు వచ్చేసింది. కారెక్కిసి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిందట. కారు డ్రైవింగ్ చేస్తూ కూడా ఈ ఘటనను తలుచుకుని ఏడ్చేసిందిట.