ప్రస్తుతం టాలీవుడ్ లో ఆనసూయ హాట్ గాను, సుమా కనకాల వాక్చాతుర్యముతోను, రష్మీ అందాలతోను, శ్రీముఖి ఎనర్జీతోను, వర్షిణి అమాయకంగాను బుల్లితెర ప్రేక్షకులను ఊపేస్తున్నారు. వర్షిణి గతంలో హీరోయిన్ గా కూడా నటించింది కానీ కొన్నాళ్లుగా హీరోయిన్స్ ఆఫర్స్ లేక యాంకర్ అవతారమెత్తింది. మొదట్లో మెత్తగా ఉండే వర్షిణి ఇప్పుడు కత్తిలా తయారైంది. పటాస్ స్టేజ్ మీదే ముద్దులతో తోటి యాంకర్స్ బుగ్గలు కొరికేస్తున్న వర్షిణి ఢీ డాన్స్ షోలో ఆది తో కలిసి బాగా హైలెట్ అయ్యింది. ఆది – వర్షిణి జోడి పై రకరకాల ఊహాగానాలు, వర్షిణి తోటి యాంకర్స్ తో గొడవలు పడుతుంది అనే వాటికీ ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది వర్షిణి.
తోటి యాంకర్స్ హరిప్రియతోను, అలాగే శ్రీముఖితోను మీకు విభేదాలున్నట్లుగా సోషల్ మీడియా టాక్ మీరేమంటారు అనగా.. నాకు వాళ్లతో ఎలాంటి గొడవలు లేవు. అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియడం లేదు. హరిప్రియ, శ్రీముఖితో తనకు పెద్దగా ఫ్రెండ్ షిప్ కూడా లేదు. జస్ట్ హాయ్ అంటే హాయ్ బై అంటే బై అని చెప్పుకునే పరిచయమే తప్ప వాళ్లతో గొడవలు పడేంత స్నేహం లేదంటుంది వర్షిణి