in

anchor srimukhi’s sarcastic reply shocks her fan!

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాటింగ్‌లో శ్రీ‌ముఖి ఓ వింత అనుభ‌వాన్ని ఎదుర్కొన్నారు. నెటిజ‌న్ ఓ తుంట‌రి ప్ర‌శ్న‌కు , శ్రీ‌ముఖి చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చారు. ఆ తుంట‌రి కోర‌కూడ‌ని కోరిక తీర్చే సంద‌ర్భంలో శ్రీ‌ముఖి ప్ర‌ద‌ర్శించిన చతుర‌తపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఇంత‌కూ ఆ నెటిజ‌న్ కోరింది ఏంటంటే… న‌గ్నంగా ఉన్న ఫొటో షేర్ చేయాల‌ని. ఆ క్ష‌ణంలో శ్రీ‌ముఖి షాక్‌కు గురై … ఆ వెంట‌నే తేరుకుని, స‌ద‌రు తుంట‌రికి షాక్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమా పోస్టర్‌ను ఆ నెటిజ‌న్‌కు షేర్ చేసి… శ్రీ‌ముఖి కంగు తినిపించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శ్రీ‌ముఖి పోస్ట్ చేశారు. శ్రీముఖి బ్రిలియెంట్ ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వావ్‌…మీ మెద‌డు నిజంగా పాద‌ర‌సంలా ప‌నిచేస్తోంది,  సూపర్బ్‌ శ్రీముఖి..వాట్‌ ఎ రిప్లై …ఇలా శ్రీ‌ముఖిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురుస్తోంది. మొత్తానికి చెంప చెళ్లుమ‌నిపించేలా శ్రీ‌ముఖి ఆన్స‌ర్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి

kannada beauties ruling Tollywood!

Gopichand and Rashi Khanna to team up for the third time!