in

Anchor Anasuya Bharadwaj Fires on Media Reporter!

న్నికల్లో గెలిచినట్టు రాత్రి ప్రకటించి.. మరుసటిరోజు ఓడిపోయానని చెప్పటంలో మతలబేంటి.. అంటూ అనసూయ సంచలన ట్వీట్ పెట్టింది. దీంతో నిన్నటి ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశంలో అనసూయని మీడియా వారు చుట్టిముట్టి అనేక ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించిన మీడియాపై చిందులేసింది ఈ జబర్దస్త్ యాంకర్. ‘నేను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎక్కడ చెప్పలేదు. అఖండ మెజారిటీతో గెలిచానని మీరే రాశారు. కొంచం న్యూస్ రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి. న్యూస్ రాయండి కానీ క్రియేట్ చేయొద్దు అంటూనే.. నాపై తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా అంటూ అనసూయ మీడియా సమావేశం నుండి వెళ్ళిపోయింది. నా పేరు వాడి లేనిపోని కథనాలు రాస్తే కోర్టుకు వెళ్తా.. అంటూ అనసూయ తీవ్రంగా హెచ్చరించింది కూడా.

Maha Samudram!

happy birthday sai dharam tej!