in

Anasuya Entry Into Kollywood With Silk Smitha Biopic?

వైపు బుల్లితెరపై తన మార్క్ చాటుకుంటూనే వెండితెరపై రాణిస్తుంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న అనసూయ తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..’ అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతితో కలసి ఆమె నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీ హిట్ అయితే తమిళనాట కూడా ఈ అమ్మడు సత్తా చాటుతుందంటున్నారు. ఈ చిత్రం కోసమే ఇటీవల ఆమె చెన్నై వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఒకప్పటి శృంగారతార సిల్క్ స్మిత బయోపిక్ గా రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

‘middle class melodies’ director ku goppa jeevitha sathyanni nerpina singitham srinivas!

Singer Sunitha gets engaged!