
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి అనన్య పాండేను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ అనన్య పాండే స్పెషల్ సాంగ్ చేస్తోందో లేదో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట..
పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..!!
