బిగ్ బి అమితాబ్ గారికి తన ప్రిన్స్ గడ్డం తో పాటు రిస్ట్ వాచ్ లు అన్నా కూడా చాల ఇష్టం. అయన దగ్గర చాల వాచ్ ల కలెక్షన్ ఉంది. అయన కొన్ని సందర్భాల్లో రెండు వాచీలు ధరిస్తారు. సవ్యసాచి లాగా కుడి చేతికి ఒకటి, ఎడమ చేతి కి ఒకటి అనుకుంటారేమో,అదేమీ కాదు. అమితాబ్ గారు కొన్ని ప్రత్యేకమయిన సందర్భాల్లో ఒకే చేతి కి రెండు వాచ్ లు పెట్టుకుంటారు. ఆయన పిల్లలు ఎవరయినా విదేశాలకు వెళితే, ఇండియన్ స్టాండర్డ్ టైం కోసం ఒక వాచ్, వారు వెళ్లిన దేశం టైం చూపించే మరొక వాచ్ పెట్టుకుంటారు. వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఆ విదేశీ టైం చూపే వాచ్ లోని టైం ప్రకారం వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడతారట, దట్ ఇస్ బిగ్ బి.