in

Amit Shah Meets Ranbir Kapoor, Sai Pallavi and Ramayana Team

Amit Shah Meets Ranbir Kapoor, Sai Pallavi and Ramayana Team!

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన, బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న వసూళ్లతో చిత్రబృందం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ ప్రత్యేక సమావేశంలో ‘రామాయణ’ చిత్రానికి సంబంధించిన పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు ‘రామాయణ’ దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా, సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సినిమా రూపకల్పన, కథా నేపథ్యం, చిత్రీకరణకు సంబంధించిన పలు విషయాలను ఆయనతో పంచుకున్నట్లు తెలుస్తోంది..భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఇంతటి భారీ స్థాయిలో సినిమాగా రూపొందిస్తున్నందుకు అమిత్ షా వారిని అభినందించారు.

ఈ సందర్భంగా రామాయణం గొప్పతనం, దాని చారిత్రక నేపథ్యం, భారతీయ సంస్కృతిలో ఈ ఇతిహాసానికి ఉన్న ప్రాధాన్యత గురించి చర్చించినట్లు సమాచారం. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలు, వాటి వెనుక ఉన్న సందేశాలు, విలువల గురించి అమిత్ షా వివరించిన విషయాలు చిత్రబృందాన్ని ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రంగా కాకుండా.. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, పురాతన వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసే గొప్ప ప్రయత్నంగా ఆయన అభివర్ణించినట్లు సమాచారం. అమిత్ షాతోజరిగిన ఈ సమావేశం తమకు ప్రత్యేకమైన అనుభవమని చిత్రబృందం వెల్లడించింది. రామాయణ పార్ట్ 1 లో రణ్‌బీర్ కపూర్ భగవాన్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతాదేవి గా నటించారు..కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా ప్రేక్షకులను అలరించారు..

నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో కలిసి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతికత, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రామాయణ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా 21 డేస్ లో 1,755 కోట్ల వసూళ్లు సాధించింది .మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగంపై కూడా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మొదటి భాగం తర్వాత రాముడు, రావణుడి మధ్య జరిగే యుద్ధ ఘట్టాలను రెండో భాగంలో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌ను 2028 దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాబోయే భాగంలో ఎలాంటి భారీ సన్నివేశాలు, విజువల్ అద్భుతాలు చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది..!!

shcking Responses for Sai Pallavi's ramayana and om!

Shocking Responses for Sai Pallavi’s Ramayana and OM!

sharwanand, anupama, dimple hayathi bhogi movie review!

Sharwanand, Anupama, Dimple Hayathi Bhogi Movie Review