in

amala paul: ready to act nude if story demands

మలయాళకుట్టి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ చిత్రంలో లిప్‌లాక్‌  సన్నివేశాల్లో నటించింది. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని రీసెంట్‌గా విడుదల చేశారు. అందులో లిప్‌లాక్ సన్నివేశాలను కూడా పొందుపరిచారు. ఈ లిప్‌లాక్‌పై విమర్శలు చెలరేగడంతో.. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమలాపాల్.. వాటిపై వివరణ ఇచ్చారు.

‘‘ఆడుజీవితం స్టోరీని వినిపించే సమయంలోనే లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందని దర్శకుడు వివరించారు. దానికి నేను ముందుగానే సమ్మతించాను. పైగా ఆ సన్నివేశం లిప్‌లాక్‌ చేస్తేనే పండుతుంది. అందుకే అలా నటించాను. ‘ఆడై’ అనే చిత్రంలో న్యూడ్‌గా నటించాను. నా వరకు కథ డిమాండ్‌ చేస్తే దుస్తులిప్పేసి నటించేందుకు కూడా ఎలాంటి బెరుకు లేదు. గతంలోనే న్యూడ్‌గా నటించిన నాకు ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడం పెద్ద విషయంగా అనిపించలేదు’’ అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది..!!

SreeLeela for a special song in PKSDTs movie?

N.T.R. THE REAL LIFE HERO!