in

Allu Arjun’s Sarrainodu has created a unique record.

వెండి తెర పై స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్  కు ఉన్న క్రేజ్‌ అంతఇంత కాదు. ఆయనకు తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకిమంచి ప్యాన్స్ ఫాలోయింగ్ . అల్లు అర్జున్‌ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

mahesh daughter sithara birthday!

kiara advani about her early struggles!