in

allu arjun’s pushpa beats jr ntr’s bheem teaser record!

ప్యాన్ ఇండియా మూవీగా వ‌స్తున్న‌ ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ బ్యానర్లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ బ‌ర్త్ డే కానుకగా ‘పుష్ప రాజ్’ పాత్రను పరిచయం చేస్తూ ‘పుష్ప’ టీజ‌ర్ ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయండి. ఇక దీంతో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది పుష్ప‌.

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డుని కూడా బ్రేక్ చేసి ఓ ప‌నైపోయింది బాబు అంటున్నాడు పుష్ప‌రాజ్‌. ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి వచ్చిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ 40 రోజుల్లో అత్యధికంగా 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు తెచ్చుకుంది. అయితే పుష్ప మాత్రం కేవ‌లం 11 రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదండోయ్ 44 మిలియన్ల పైగా వ్యూస్ ను తెచ్చుకుంది. చూడాలి మ‌రి ఇంకెన్నిరికార్డులు బ్రేక్ చేస్తుందో..

Nazriya Nazim lands in Hyderabad to shoot for Nani’s next!

Vijay Devarakonda, Sukumar film not shelved, confirms Falcon Creations!