in

Vijay Devarakonda, Sukumar film not shelved, confirms Falcon Creations!

తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఇక సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఆ రూమర్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. ఈ సినిమాపై వస్తున్న పుకార్లను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్‌లో వెల్లడించింది..

allu arjun’s pushpa beats jr ntr’s bheem teaser record!

27 YEARS FOR HELLO BROTHER!