in

Allu Arjun Remembers His First Girlfriend After Seeing A Contestant!

కానిక్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ పార్ట్ 1ను ఆహా శనివారం సాయంత్రం స్ట్రీమింగ్ చేసింది. ఫైనల్‌కు చేరుకున్న టాప్ 5 కంటెస్టెంట్ల పెర్‌ఫార్మెన్స్‌ మొదలైంది. ఈ ఫినాలేకు గెస్టుగా వచ్చిన అల్లు అర్జున్ కొన్ని ముఖ్యమైన సంగతులను పంచుకున్నారు. శనివారం ఎపిసోడ్‌లో ఫైనల్ కంటెస్టెంట్లు సౌజన్య, కార్తికేయ, శృతి నండూరి తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన పాటలు వచ్చినప్పుడు… వాటి వెనుక ఉన్న సంగతులను పంచుకున్న ఆయన మరో ముఖ్యమైన సంగతినీ బయటపెట్టారు.

న్‌ఆర్‌ఐ డాక్టర్ సింగర్ శృతి నండూరి గీతాలకు ఫిదా అయిన స్టైలిష్ స్టార్..తన మొదటి గర్ల్‌ ఫ్రెండ్ పేరు శృతినే అంటూ బయటపెట్టేశారు. ఈ విషయాన్ని ఫస్ట్ టైమ్ బయటకు చెబుతున్నా అన్న ఆయన..“ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో” అంటూ సరదాగా నవ్వేశారు. ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్ సూపర్‌ హిట్ అవ్వడంతో ఆహా సెకండ్ సీజన్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. మొత్తం పదివేల మంది ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ లో పార్టిసిపేట్ చేయాలని తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు..విదేశాల నుంచి సైతం ప్రయత్నించారు..

Adah Sharma: ‘Actresses Are Called First On Set’!

Pawan Kalyan’s BRO- Urvashi Rautela to do a special song?