అల్లు అర్జున్ అట్లీ సినిమా కంఫర్మ్
పుష్ప తో ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ స్టామినా ఏంటో బాలీవుడ్‌కు కూడా తెలిసింది. దీంతో బన్నీ తర్వాత మూవీ ఏంటన్న దానిపై ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అట్లీతో ఒక సినిమా చేయనున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్న సంగతి తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటిస్తూ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ, అట్లీతో కలిసి సినిమా చేస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి మరింతగా పెరిగింది..!!