in

WHAT IS THE RELATION BETWEEN SAVITRI AND LALITHA Jewellery!

లిత జ్యూవెలరీ కి మహా నటి సావిత్రి గారికి ఉన్న అనుబంధం ఏమిటి? సావిత్రి గారికి బంగారు నగలు అంటే చాల ఇష్టం, ఆ రోజుల్లో ఏదైనా బంగారు నగల షాప్ ఓపెనింగ్ పిలిస్తే ఇక వాడి పంట పండినట్లే, బోణి పేరుతో సావిత్రమ్మే చాల నగలు కోనేసే వారట. సావిత్రి గారు బాగున్నా రోజుల్లో కేజీల కొద్దీ బంగారం ఆమె ఒంటి మీద,ఇంట్లోనూ ఉండేది. అదే విధంగా ఆమెకు కార్ లు అన్న చాల ఇష్టం ఉండేది కొత్త మోడల్ కార్ ఏది వచ్చిన కోనేసేవారట.” డబ్బు ఎవరికి ఊరికే రాదు” గుండు బాబాయ్ గుర్తున్నాడా? అదేనండి మన లలిత జ్యూవెలరీ ఓనర్, రోజు టి.వి. లో కనిపించి డబ్బు యెవరికి ఊరికే రాదు అని ఊదర గొడుతుంటాడే ఆయనే. బంగారం వ్యాపారంలో వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన కిరణ్ కుమార్ (గుండు బాబాయ్) , ప్రస్తుతం లలిత జ్యూవెలరీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నది ఎక్కడో తెలుసా? చెన్నై లోని, నెంబర్ 53 , హబీబుల్లా రోడ్ లో ఉన్న, సావిత్రి గణేష్ బిల్డింగ్ లో,అది సావిత్రి గారు బాగున్నా రోజుల్లో మోజు పడీ, ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటి ప్రక్కనే, ఉన్న మరో ఇంటిని కమర్షియల్ ప్రాపర్టీ గ డెవలప్ చేసారు సావిత్రి కుమార్తె..

ఆ కమర్షియల్ ప్రాపర్టీ ని లలిత జ్యూవెలరీ ఓనర్ గుండు బాబాయ్ కొనేశారు, అందులోనే తన కార్పొరేట్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. అయన ఆ ఇంటిని కొన్న తరువాత కూడా, సావిత్రి గారి మీద ఉన్న గౌరవం తో ఆ ఇంటి పేరును అంటే “సావిత్రి గణేష్ బిల్డింగ్” పేరును అలాగే ఉంచేశారు. ఆ ఇంటిని అమ్మేసిన తరువాత సావిత్రి గారి కూతురు ఆ ఇంటి ఎంట్రన్స్ హాల్ లో ఉన్న సావిత్రి గారి ఫోటో తీసేయబోతే, ఆమెను వారించిన కిరణ్ కుమార్ గారు, సావిత్రి గారి ఫోటో ను అలాగే ఉంచేయమని అభ్యర్ధించారట. ఇప్పటికి లలిత జ్యూవెలరీ ఆఫీస్ లోకి ఎంటర్ కాగానే హాల్ లో సావిత్రి గారి ఫోటో దర్శనం ఇస్తుంది. కోట్లు పెట్టి కొన్నఇంటిని సావిత్రి గారి మీద ఉన్న గౌరవం తో, ఆ పేరును, ఆమె ఫోటో ను అలాగే ఉంచేశారు,.కిరణ్ కుమార్ వ్యాపారమే కాదు, అయన మనసు కూడా బంగారమే అని చెప్పాలి. సావిత్రి గారి లాగే మన కిరణ్ కుమార్ గారికి కూడా కార్ లు అంటే చాల ఇష్టం అయన దగ్గర నలభై కార్లు ఉన్నాయి ప్రస్తుతం..!!

sai pallavi hits a jackpot in Kollywood?

fans criticize balayya for saying ‘Akkineni Thokkineni’ comment!