in

Akkineni Sobhita Dhulipala wants to forget past completely!

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శోభితను ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగారు. “మీ లైఫ్‌లో ఏ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నారు?” అని ప్రశ్నించగా..దానికి శోభిత ఏమాత్రం తడబడకుండా..”నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, జ్ఞాపకాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నాను” అని ఆన్సర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సమాధానానికి గల కారణాన్ని వివరిస్తూ..

“సాధారణంగా లోకం మతిమరుపును ఒక జబ్బుగా చూస్తుంది. కానీ నా దృష్టిలో కొన్నిసార్లు మతిమరుపు అనేది మనిషికి దొరికే ఒక గొప్ప వరం. ఎందుకంటే లైఫ్‌లో వేరే వాళ్లు మన పట్ల చేసిన బాధాకరమైన పనులు, మన మనసును గాయపరిచిన చేదు జ్ఞాపకాలను మనం మర్చిపోయినప్పుడే జీవితంలో ఫ్రీగా ముందుకు సాగడం సాధ్యమవుతుంది” అని చెప్పుకొచ్చారు. పాత జ్ఞాపకాలలోనే ఎప్పుడూ కూరుకుపోకుండా, వాటన్నింటినీ డిలీట్ చేసేసి రేపటి భవిష్యత్తు గురించి పాజిటివ్‌గా ఆలోచించడమే నేటి అవసరమని శోభిత క్లారిటీ ఇచ్చారు..!!

Bhagyashri Borse Dating a Telugu Star? says, ‘Second Home’!

Sreeleela humiliated at the International Yoga Day in Mumbai?