in

akhil akkineni to get married soon?

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో హీరో అఖిల్ అక్కినేని పెళ్లి కుదిరినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి అఖిల్ పెళ్లి శ్రేయా భూపాల్ తో జరగాల్సి ఉంది. అయితే  నిశ్చితార్థం తర్వాత వీరి పెళ్లి రద్దయింది. అనంతరం శ్రేయాభూపాల్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అఖిల్ మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. అయితే అఖిల్ పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు అమల, నాగార్జున నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యాపారవేత్తతో అక్కినేని కుటుంబం అఖిల్ పెళ్లిపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ పెళ్లి బాధ్యతలను హీరో నాగచైతన్య భార్య, నటి సమంత తీసుకుందని, ఇప్పటికే ఆమె సదరు వ్యాపారవేత్త కుటుంబంతో అఖిల్ పెళ్లిపై చర్చించిందని సమాచారం. అఖిల్ పెళ్లిపై అక్కినేని కుటుంబం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

thamanna in ‘andhadhun’ telugu remake!

bank set completed for ‘sarkaru vaari paata’!