in

Ajay Devgn vs Kiccha Sudeep ‘Hindi national language row’!

బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాము” అని అన్నారు.  “కేజీఎఫ్ : చాప్టర్ 2” సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘హిందీ ఇకపై జాతీయ భాష కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలను విమర్శించిన వారు లేకపోలేదు. అయితే సుదీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ బాలీవుడ్ అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యాయి..

అజయ్ దేవగన్… సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే, తన మాతృభాష చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. “సోదర కిచ్చా సుదీప్ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష, జాతీయ భాష. జన గణ మన” అని ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కు దారి తీసే అవకాశం ఉంది. మరి అజయ్ ప్రశ్నకు సుదీప్ రియాక్షన్ ఎలా ఉంటుందో ? అజయ్ ట్వీట్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

No Buzz and promotions for Samantha’s Next!

balakrishna, b gopal cinema ante mass audience ku pandage!