తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా త్వరలో పాతిక చిత్రాల మైలురాయి చేరుకోనున్నది. ‘కౌసల్యా కృష్ణమూర్తి’తో తెలుగు తెరకు ఆమె పరిచయమైనది. అంతకు మునుపే తమిళంలో సుమారు 20 చిత్రాలు చేసినది. మలయాళంలో రెండు, హిందీలో ఓ సినిమాలో నటించినది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నవి. తమిళ సినిమా ‘భూమిక’ ఆమెకు 25వ సినిమా. అందులో ఐశ్యర్యా రాజేష్ సైకాలజిస్ట్‌గా కనిపించనున్నది.
ఒక్క రాత్రిలో జరిగే కథతో ‘భూమిక’ తెరకెక్కిస్తున్నామని దర్శకుడు రతీంద్రన్ వెల్లడించారు. ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం ఇది. నీలగిరి కొండల్లో 25 రోజుల పాటు షూటింగ్ చేశారు. పర్టిక్యులర్‌గా ఇదొక జానర్ సినిమా అని చెప్పలేనని దర్శకుడు అంటున్నాడు. డిఫరెంట్ జానర్లో నేరేషన్ ఉంటుందని చెబుతున్నాడు. దర్శకుడితో ఐశ్వర్యా రాజేష్‌కి రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ఇదు వేదాళం సొల్లుమ్ కథై’ తెరకెక్కినది. విడుదల వాయిదా పడినది.