ఎయిర్ హోస్టెస్ కాళ్ళు మొక్కిన బ్రహ్మ్మనందం , నిజామా? పాపం అంత తప్పు ఏం చేసారు బ్రహ్మానందం గారు అనుకుంటున్నారా. మరి అంత టూ మచ్ గ ఆలోచించకండి, పాపం బ్రహ్మానందం చేత ఆ పని చేయించింది, మెగాస్టార్ చిరంజీవి గారు. బ్రహ్మానందం గారు సినీరంగ ప్రవేశం చేసిన తోలి నాళ్లలో, చంటబ్బాయి షూటింగ్ లో బహ్మానందం గారిని చిరంజీవి గారికి పరిచయం చేసారు జంధ్యాల గారు. అదే రోజు మద్రాసు కు తిరిగి వెళుతున్న సందర్భం లో మొదటి సారి గగన విహారం చేస్తున్న బ్రహ్మానందం గారు ఒకింత కంగారుగా ఉన్న సందర్భం అది. ఫ్లైట్ లోకి అడుగు పెట్టిన బ్రహ్మానందం గారిని పిలిచి ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అనబడే వారు ఉంటారు ముందుగా వారి కాళ్లకు మొక్కి, ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పారట చిరంజీవి గారు. రామ వాక్కు విన్న ఆంజనేయుడిలా వెంటనే వెళ్లి అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ అనబడే గగన సుందరి కి పాదాభివందనం చేశారట మన బ్రహ్మి..
దెబ్బకు కంగారు పడిన గగన సుందరి అక్కడ నుంచి వెళ్లిపోయారట, ఆ తరువాత చాక్లేట్లు తెచ్చిన గగన సుందరి బ్రహ్మి ముందు ఆ ప్లేట్ ఉంచగానే, బ్రహ్మి చెవిలో, బ్రహ్మం, చాక్లేట్లు బాగున్నాయని తీసుకొన్నావో, ఒక్కొక్కటి 1500 జాగర్త అన్నారట చిరు, దెబ్బకు దడుసుకున్న బ్రహ్మి చాక్లేట్ తినాలన్న కోరికను గాలికి వొదిలి, నో, ఐ డోంట్ వాంట్ అంటూ చాల స్టైల్ గ తప్పించుకున్నారట. ఎయిర్ హోస్టెస్ తెచ్చిన చాక్లేట్ బుట్టలో పడకుండా భలే తప్పించుకున్నాను అనుకున్నారట బ్రహ్మానందం గారు, పాపం ఆ తరువాత గానీ తెలియలేదు బ్రహ్మి కి చిరంజీవి గారి చిలిపితనం. తన చేత ఎయిర్ హోస్టెస్ కాళ్ళు మొక్కించటమే కాకుండా, చాక్లేట్ కూడా తినకుండా చేసిన చిరంజీవి గారి కొంటెతనం గురించి అప్పుడప్పుడు సన్నిహితుల కు చెప్పి నవ్విస్తుంటారు బ్రహ్మానందం గారు..!!