గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్‌ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య..
ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు హోస్ట్ చేయబోతుండటం విశేషం. తమిళ బిగ్ బాస్‌ను ఆరంభం నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ నడిపిస్తుండటం తెలిసిందే. ఈ సీజన్‌కు హోస్ట్ మారతారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. కమలే మళ్లీ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐతే షో మధ్యలో ఉండగా కమల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అత్యవసరంగా తాత్కాలిక హోస్ట్‌ను తీసుకురావాల్సి వచ్చింది.
తెలుగులో కొన్ని ఎపిసోడ్లను చక్కగా నడిపించిన రమ్యనే తమిళ షోకు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. రమ్యకృష్ణ బేసిగ్గా తమిళ అమ్మాయే. తమిళం బాగా మాట్లాడుతుంది. అక్కడ ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది. తమిళ బిగ్ బాస్‌ను కొన్ని రోజులు హోస్ట్ చేయడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేకపోయింది. మంచి పారితోషకం కూడా ఇస్తుండటంతో సంతోషంగా ఈ పని ఒప్పుకుంది. కమల్ కోలుకుని తిరిగొచ్చే వరకు ఆమెనే తమిళ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించనుంది.