in

after deepika, its nayanthara now to wear bikini for srk!

షారుఖ్ ఒక్క హిట్టు కొట్టేందుకు ఎంత కాలం సహనంగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. చివరకు జీరో సినిమాతో జీరో అయ్యాడు. ఇప్పుడు పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు రియల్‌ హీరోగా నిలిచాడు. అలాంటి షారుఖ్ ఇప్పుడు వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. అట్లీతో జవాన్, రాజ్ కుమార్ హిరాణితో డుంకీ సినిమాలు చేస్తున్నాడు. జవాన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాను అట్లీ పాన్ ఇండియాగా ప్లాన్ చేశాడు. అందుకే సౌత్ మార్కెట్ కలిసి వచ్చేలా నయన్‌ను రంగంలోకి దించాడు. ఈ మూవీ కోసమే నయన్ బికినీ ధరిస్తుందని టాక్.

పెళ్లైన హీరోయిన్లు ఈ మధ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తల్లైనా కూడా అందాల ఆరబోతలో డోస్ పెంచేస్తోంది. నయన్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా కూడా బికినీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. అయితే నయన్ బికినీ ధరిస్తుందా? లేదా? అన్నది మాత్రం టీం నుంచి క్లారిటీ రాలేదు.  పఠాన్ సినిమాలో దీపిక వేసుకున్న బికినీ ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. బేషరమ్ సాంగ్‌, దీపిక బికినీ ట్రీట్ మీద నేషనల్ వైడ్‌గా జరిగిన ట్రోల్, రచ్చ అందరికీ తెలిసిందే. మరోసారి షారుఖ్ సినిమాతో నయన్ బికినీ ధరిస్తుందట. మరి నయన్ బికినీ మీద ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి..!!

MM Keeravani Calls Ram Gopal Varma His ‘First Oscar’, here’s why!

Ts Minister Malla Reddy turns down Pawan Kalyan’s film offer!