అడివి శేష్. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ‘క్షణం’ సినిమా సక్సెస్ తర్వాత తనకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. అక్కడ ఛాన్సుల కోసం కొంత మంది దర్శక, నిర్మాతలను కలిసినట్టు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీలో సాధారణంగా మహిళలకు మాత్రమే లైంగిక వేధింపులు ఉంటాయని అనుకుంటారు. కానీ మగవాళ్లకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉంటాయని అపుడే తనకు తెలిసిందన్నాడు. అయితే చాలా మంది మేల్ ఆర్టిస్టులు ఇలాంటివి బయటపెట్టరని చెప్పుకొచ్చాడు. అడవిశేష్ చేసిన సంచలన ఆరోపణలపై పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు.