in

shraddha kapoor is in talks for jr ntr trivikram movie!

రవింద సమేత వంటి విజయవంతమైన సినిమా తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అరవింద సమేతకి బాణీలు అందించిన యువ సంగీత సంచలనం తమన్ నే యన్టీఆర్ 30కి కూడా స్వరకల్పన చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, కియారా అద్వాని, జాన్వీ కపూర్.. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. తాజాగా ఈ జాబితాలో మరో పేరు చేరింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా వెంచర్ సాహోతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. మరి.. శ్రద్ధ కూడా వార్తలకే పరిమితమవుతారో లేదంటే నాయికగా కన్ఫామ్ అవుతారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

thana director kosam oka illu koni gift ga icchina super star krishna!

Adivi Sesh opens up on his casting couch experience!