in

Aditi Rao Hydari to be Kamal’s sister?

ణిరత్నం సినిమా గురించి, మణిరత్నం సినిమాలో బ్యూటీ గురించి, మణిరత్నం చూపించే ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని సినిమాల ద్వారా ఒక ఫీల్ తో ప్రేక్షకుల్ని కూర్చుని పెట్టడం మణిరత్నానికి మాత్రమే సాధ్యం. కేవలం ప్రేమకథా చిత్రాలు మాత్రమే మణిరత్నం తెరకెక్కించాడు అనుకుంటే అది పొరపాటు. “నాయకుడు” లాంటి గ్యాంగ్ స్టార్ సినిమా, యువ లాంటి పొలిటికల్ డ్రామాను కూడా తెరకెక్కించాడు మణిరత్నం.

“నాయకుడు” సినిమాని తెలుగు గాడ్ ఫాదర్ అని కూడా కొంతమంది పిలుస్తారు. ప్రస్తుతం మణిరత్నం కమల్ 234 సినిమాని డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ యంగ్ బ్యూటీ అదితిరావ్ హైదరి నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి కమల్ హాసన్ చెల్లెలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే మణిరత్నం దర్శకత్వం వహించిన “చెలియా” సినిమాలో కార్తీ సరసన నటించింది అదితి!

Manchu Vishnu gets injured in Kannappa shoot!

Allu Arvind suggests Mrunal Thakur to be ‘telugu kodalu’