in

aditi rao hydari rejects rs 1 cr add?

క్రేజీ హీరోయిన్ అదితి రావ్ వనపర్తి సంస్థాన అధినేత అక్బర్ హైదరి ముని మనవరాలు అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సాలెహ్ మనవరాలు. టాప్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ కు అదితి కజిన్ అవుతుంది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె ఇప్పటికీ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయింది. దీనికికారణం ఆమె తాను నటించే సినిమాలోని పాత్ర గురించి ఆలోచిస్తుంది కాని ఆ పాత్ర చిన్నదా పెద్దదా అన్నవిషయం ఆలోచించదు. ఈనేపధ్యంలో ఈమె ఈమధ్య ఒక మల్టీ నేషనల్ కంపెనీ సంబంధించి కోటి రూపాయల భారీ పారితోషికం వచ్చే యాడ్ లో నటించడానికి తిరస్కరించడం సంచలన వార్తగా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు సౌందర్య సాధనాలు తయారు చేయడంలో అగ్రగామి సంస్థగా పేరున్న ఆ కంపెనీ ఒక ఫేస్ క్రీమ్ కు సంబంధించి తమ యాడ్ లో నటించి తమ కంపెనీ ఫేస్ క్రీమ్ రాసుకుంటే ఎలాంటి అమ్మాయి అయినా అందంగా మారిపోతారు అని ప్రచారం చేసే యాడ్. ఈ యాడ్ వివరాలు విని అదితి షాక్ అవ్వడమే కాకుండా అందం అన్నది తల్లి తండ్రుల జీన్స్ ను బట్టి వస్తుంది కాని ఫేస్ క్రీమ్ లను బట్టి వస్తుందా అంటూ ఆమె ఆయాడ్ ను తయారుచేయబోతున్న కంపెనీ నిర్వాహకులకు రివర్స్ క్లాస్ పీకినట్లు టాక్

nag ashwin’s web film with shruthi haasan!

payal rajput cries like a child!