in

aditi rao about cinema industry struggles!

తాజా ఇంటర్వ్యూలో అదితీ రావు సినీ పరిశ్రమకు దాపురించిన తాజా పరిస్థితుల గురించి విచారం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ సాఫ్ట్ కార్నర్ గా మారడం విచారకరం అని ఆవేదనను వ్యక్తం చేసింది అదితీ. “మేం ఎవరైనా సంబంధిత సమస్య గురించి మాట్లాడితే అందులో ఒక తప్పు పదం దొరికినా వెంటనే టార్గెట్ అయిపోతాం. ప్రతి ఒక్కరూ తప్పు మాట్లాడినవారిపై బౌన్స్ అవుతారు. అలాగని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరూ బలవుతారు. ప్రతిదానికి చిత్ర పరిశ్రమనే బలి చేస్తారా? ఇది సరైంది కాదు“ అంటూ అదితీ ఆవేదన వ్యక్తం చేసింది.

మహమ్మారి సమయంలో కూడా ప్రజలకోసం చాలా మంది తారలు చాలా మంచి పనులు చేస్తున్నారని తెలిపింది. మంచిని దాచి చెడును ప్రతికూలతను హైలైట్ చేస్తున్నారు. ప్రజలు దాని గురించి మాత్రమే మాట్లాడుతారు. అందరూ ప్రతికూలంగా కాకుండా సానుకూలతపై ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను“ అని అదితీ అన్నారు. అన్నట్టు అదితీరావ్ నటించిన వి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. పలు క్రేజీ చిత్రాల్లో అదితీ నటిస్తోంది.

koratala siva fights for defamation!

king nagarjuna in yatra 2?