in

king nagarjuna in yatra 2?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా మహీ వీ రాఘవ దర్శకత్వంలో ‘యాత్ర’ పేరిట బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో ‘యాత్ర-2’ స్క్రిప్ట్ ను ఆయన సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వీ రాఘవ చెప్పిన స్క్రిప్ట్ పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.

aditi rao about cinema industry struggles!

hero nikhil turns into director!