in

Actress Nidhi says her legitimate reason for ‘not dancing in the rain’!

స్మార్ట్ శంక‌ర్ సినిమాతో త‌న ఫాలోవ‌ర్ల‌ను పెంచేసుకుంది అందాల బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. ఈ భామ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వ‌స్తోన్న‌ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ హీరో కూడా చేస్తోంది. ప‌లు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల‌పై డిస్క‌ష‌న్స్ కూడా కొన‌సాగిస్తోంది. సినిమాల్లో వ‌చ్చే రెయిన్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హీరోహీరోయిన్లు వ‌ర్షంలో త‌డుస్తూ, ఎండుతూ ఎంతో క‌ష్ట‌ప‌డి న‌టించిన పాట‌లు సిల్వ‌ర్ స్క్రీన్ పై చాలా వ‌ర‌కు హిట్ట‌య్యాయి. అయితే రెయిన్ సాంగ్ కోసం చాలా కష్ట‌ప‌డాల‌ని,

త‌న వ‌ల్ల ఆ ప‌ని కాదంటోంది ఇస్మార్ట్ భామ..అయితే రెయిన్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే స్పెష‌ల్ సాంగ్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో నిధిని ప్ర‌శ్నించారు..దీనిపై నిధి స్పందిస్తూ..రెయిన్ సాంగ్స్ షూట్ చేయ‌డం అంత సుల‌భం కాదు. షాట్ టైంలో త‌డిసిపోవాలి…ఆ త‌ర్వాత పొడిగా మారాలి. మ‌ళ్లీ షూటింగ్ కోసం త‌డిగా మారాలి. ఇలా చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. వ‌ర్షం పడుతున్న స‌మ‌యంలో క‌ళ్లు తెరిచి కెమెరా ముందు న‌టించాలంటే ఛాలెంజ్ తో కూడుకున్నది. అందుకే ప్ర‌స్తుతానికి రెయిన్ సాంగ్స్ లో న‌టించ‌డం గురించైతే తాను ఆలోచించ‌లేదంటూ చెప్పుకొచ్చింది నిధి అగ‌ర్వాల్‌.

milky beauty turns item girl for ‘gani’!

sakshi agarwal soaked in the rain!