తాజాగ మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిషన్ విడుదల చేసిన నివేదికతో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఈ అంశంపై పలువురు నటీమణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార అదా శర్మ సైతం ఓపెన్ అయ్యారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నిజం చెప్పాలంటే.. నేను నేల మీదనే కూర్చున్నాను.. సోఫా(కౌచ్)లో కూర్చోవాలని అనుకోలేదు’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంటే అవకాశాల కోసం తానెప్పుడూ అలాంటి వాటికి ఒప్పకోలేదని అదాశర్మ తేల్చి చెప్పేసింది..!!