in

Aamir Khan confirms dating Gauri Spratt!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురువారం త‌న 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’, స‌ల్మాన్ ఖాన్‌, షారూఖ్ ఖాన్‌తో స్నేహ‌బంధం, త‌న స్నేహితురాలు గౌరీ స్ప్ర‌త్‌తో డేటింగ్ ఇలా ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల‌ను ఆయ‌న విలేక‌రులతో పంచుకున్నారు. గౌరీతో త‌న‌కు పాతికేళ్ల ఫ్రెండ్‌షిప్ ఉన్న‌ట్లు తెలిపారు..

గ‌త ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బెంగ‌ళూరుకు చెందిన ఆమె త‌న‌ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు ఆమిర్ చెప్పారు. గౌరీకి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 2021లో త‌న భార్య కిర‌ణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు రీనా ద‌త్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు. అలాగే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’ స్క్రిప్ట్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్‌ వర్క్‌ మాత్రమే మొదలు పెడుతున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌..దీని కోసం ఒక టీమ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నామ‌ని చెప్పారు..!!

Mohan Babu faces murder allegations for Soundarya’s death!

Odisha Deputy CM Pravati gives an official update on SSMB29!