దివంగత నటి సౌందర్య మృతికి ప్రముఖ నటుడు మోహన్ బాబు కారణం అంటూ ఆయనే ఆమెను హత్య చేశాడంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. సౌందర్య ఆస్తుల కోసమే మోహన్ బాబు ఈ హత్య చేసినట్టుగా అతను చెబుతున్నాడు. నిన్నటి నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ వచ్చింది. ఐతే దీనిపై మోహన్ బాబు స్పందిచలేదు కానీ సౌందర్య భర్త రఘు ఒక లెటర్ ద్వారా స్పందించారు. సౌందర్య మృతిపై మోహన్ బాబు పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఆయన చెప్పుకొచ్చారు..
సౌందర్యతో మోహన్ బాబుకి ఎలాంటి ఆస్తి పరమైన గొడవలు లేవని ఆయన అన్నారు. ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘు అన్నారు. సౌందర్యకు సంబంధించిన ఆస్తులను మోహన్ బాబు అక్రమంగా లాక్కోలేదని ఆయన సౌందర్య దగ్గర నుంచి కొనుక్కున్నారని చెప్పుకొచ్చారు. సౌందర్య భర్తే స్వయంగా ఆమె మృతికి ఎవరు కారణం కాదని చెబుతుంటే ఆస్తుల విషయమై సౌందర్యని మోహన్ బాబు హత్య చేశాడంటూ వ్యక్తి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉంది..!!