in

aagipoyina mastaru-mogilijada!

తెలుగు వెండి తెర మీద ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా అత్యంత అద్భుతంగా రాణించిన నటుడు ఎవరు అంటే సగటు తెలుగు ప్రేక్షకుడు తడుముకోకుండా శోభన్ బాబు గారి పేరు చెప్తాడు. అటువంటి శోభన్ బాబు గారిని బాపు,రమణ ద్వయం అష్టభార్యల ముద్దుల మొగుడిగా తెలుగు ప్రేక్షకులకు చూపించాలి అని ప్రయిత్నించారు కానీ సఫలం కాలేదు. శోభన్ బాబు గారిని బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడిగా, సంపూర్ణ రామాయణం చిత్రంలో రాముడిగా చూపించి, తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసిన బాపు, రమణ గారు. 1994 లో ఒక సోషియో ఫాంటసీ కథ అనుకోని శోభన్ బాబు గారిని కలవటం,

కథ విన్న శోభన్ బాబు గారు “కమాన్” చేసేద్దాం అనటం జరిగి పోయింది..అందులో హీరో ఎనిమిది మంది భార్యలతో ఎలా నెగ్గుకుని వచ్చాడు అనేది కధాంశం, ఆ చిత్రానికి ” మాస్టారు-మొగిలిజడ” అని నామకరణం చేసారు. శోభన్ బాబు గారి పుట్టిన రోజున పత్రికలలో ప్రకటన కూడా చేశారు, రమ్య కృష్ణ ను ఒక హీరోయిన్ గ అనుకున్నారు. ఇంతలో నిర్మహతలు వెనుకంజ వేయటం తో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ల లేదు, లేకుంటే తెలుగు ప్రేక్షకుడికి షడ్రుచుల తో వండి వార్చిన విందు భోజనం వంటి సినిమా చూసే అవకాశం దక్కి ఉండేది.

vaani kapoor in black saree at a movie interview!

Pushpaka Vimanam!