in

a wise decision taken by sreeleela!

క మంచి అవకాశాన్ని వదులుకోవాలంటే హీరోయిన్లు పడే అంతర్మథనం అంతా ఇంతా కాదు. ఆది హిట్ అయినా ఫ్లాప్ అయినా లైట్ తీసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ కన్నా ముందు తీసుకున్న ఛాయస్ శ్రీలీల. కొన్ని సీన్లు షూట్ చేశారని టాక్ వచ్చింది. అయితే కొద్దిరోజులయ్యాక అందులో నుంచి బయటికి వచ్చేసింది. కథ పరంగా ఉన్న బోల్డ్ నెస్,

తప్పక పెట్టాల్సిన లిప్ లాక్ కిస్సుల వల్లే డ్రాప్ అయ్యిందనే టాక్ అంతర్గతంగా వినిపించింది. కట్ చేస్తే ఆ స్థానంలో అనుపమ వచ్చి దర్శకుడు కోరుకున్నది తెరమీద ఆవిష్కరించింది. ముఖ్యంగా క్యారెక్టర్ కు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ ని పోషించిన తీరు ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఒకవేళ ఇదే పాత్ర శ్రీలీల చేసి ఉంటే ఖచ్చితంగా తన ఇమేజ్, అవకాశాల మీద ప్రభావం పడేది. అనుపమ పక్కింటి అమ్మాయి పాత్రలు విసుగొచ్చే బోల్డ్ టర్న్ తీసుకుంది..!!

Shruti Haasan replaces Samantha in ‘Chennai Story’!

Aamir Khan to play antagonist in SS Rajamouli, Mahesh Babu’s movie?