అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా బాక్సాపీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ వస్తుందని గతంలోనే నాగ్ క్లారిటీ ఇచ్చాడు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఫిలిం నగర్ సమాచారం మేరకు బంగార్రాజు చిత్ర షూటింగ్ జనవరి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం. సింగిల్ షెడ్యూల్లో మూవీని పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మంచి బాణీలు సమకూరుస్తుండగా, సినిమాకు ఇవి చాలా ప్లస్ అవుతాయని అంటున్నారు.