
టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అరవింద్ఏ సినిమా వేడుకకు హాజరైనా తన మాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం, సమయస్ఫూర్తి, చమత్కారాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్లో కూడా అల్లు అరవింద్ తనదైన శైలిలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రుహానీ శర్మ పెళ్లి గురించి ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు రుహానీ పెళ్లి గురించి అల్లు అరవింద్ ఎందుకు అలా మాట్లాడారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు..ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటున్న ఈ సినిమా విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
ఈ వేడుకలో వేదికపై ఉన్న రుహానీ శర్మ తో ఆయన సరదాగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోనే మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా? ఇక్కడే స్థిరపడవచ్చు కదా? అంటూ సలహా ఇచ్చారు. దీనికి రుహానీ చిరునవ్వుతో ‘ఇట్స్ ఎ బ్లెస్సింగ్’ అంటూ సమాధానమిచ్చింది. వెంటనే అల్లు అరవింద్ స్పందిస్తూ..అంటే నీ మనసులో ఇప్పటికే ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అల్లు అరవింద్ ఇలాంటి సలహా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సరదాగా సూచించారు..ఆ తర్వాత ఆమె నిజంగానే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి వివాహం చేసుకోవడంతో మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. అల్లు అరవింద్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ముఖ్యంగా రుహానీ శర్మ పెళ్లి ప్రస్తావన రావడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తనదైన చమత్కారంతో చేసిన వ్యాఖ్యలను కొందరు సరదాగా తీసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అల్లు అరవింద్ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో లావణ్య విషయంలో జరిగినట్లుగానే ఇప్పుడు రుహానీ విషయంలోనూ ఏదైనా ప్రత్యేక విషయం ఉందా? ఆమెకు ఇప్పటికే పెళ్లి సంబంధం కుదిరిందా? అనే కోణంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలోకి రుహానీ కోడలిగా వెళ్లబోతుందేమోనని కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం అభిమానులు, నెటిజన్లు చేస్తున్న ఊహాగానాలు మాత్రమే. రుహానీ శర్మ వివాహం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉందా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

