in

Vishwak Sen got emotional talking about his tough times!

Vishwak Sen got emotional talking about his tough times!

విశ్వక్ సేన్నటించిన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం నవంబర్ 24న సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వక్ తన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను అభిమానులతో పంచుకున్నారు. తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ముంబైలోని ఫిల్మ్ స్కూల్‌లో చేరానని, ఆ తర్వాత 17 ఏళ్ల వయసు నుంచే ఆడిషన్స్ కోసం స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించానని చెప్పారు. దాదాపు నాలుగేళ్ల పాటు అవకాశాల కోసం ప్రయత్నించినా సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చివరకు 21 ఏళ్ల వయసులో డబ్బులు లేవనే కారణంతో తన గర్ల్‌ఫ్రెండ్ కూడా తనను వదిలి వెళ్లిపోయిందని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఆ బాధను భరిస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు..ఇక ఒక సినిమాలో తనను మొదట హీరోగా ఎంపిక చేసి, ఆ తర్వాత ఒక్కో నెల గడిచేకొద్దీ పాత్ర ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారని విశ్వక్ వెల్లడించారు.

మొదటి నెలలో మెయిన్ హీరోగా చెప్పి, రెండో నెలలో సెకండ్ హీరోగా, మూడో నెలలో థర్డ్ హీరోగా మార్చారని, చివరకు నాలుగో హీరో స్థాయికి తీసుకొచ్చారని తెలిపారు. అంతటితో ఆగకుండా సినిమాలో తనను పూర్తిగా తొలగించిన విషయాన్ని కూడా వెంటనే చెప్పకుండా దాదాపు 20 రోజుల పాటు ఆఫీసు చుట్టూ తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక జీవితంలో మొదటిసారి ఇంటికి వెళ్లి మూడు రాత్రులు ఏడ్చానని చెప్పారు. ఆ సంఘటన తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని గుర్తు చేసుకున్నారు. అయితే తన జీవితంలో అత్యంత కీలకమైన సమయంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ అండగా నిలిచారని విశ్వక్ తెలిపారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో అవకాశం వచ్చిన సమయంలో తనపై ఒక వ్యక్తి కుట్ర చేశాడని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో తనతో వివాదం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆడిషన్స్‌లో ఛాన్స్ రాకపోవడంతో తనపై కోపం పెంచుకుని కక్ష సాధించేందుకు ప్రయత్నించాడని తెలిపారు..తనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఓ అమ్మాయి పేరుతో నకిలీ జీమెయిల్ ఖాతా సృష్టించి తరుణ్ భాస్కర్‌ కు బెదిరింపు మెయిల్ పంపించాడట..

ఆ మెయిల్‌లో విశ్వక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతడిని సినిమాలో తీసుకుంటే మీడియాకు వెళ్లి సినిమా పరువు తీస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. దీంతో మొదట తరుణ్ భాస్కర్ తనను సినిమా నుంచి తప్పించారని చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విశ్వక్ నేరుగా తరుణ్ భాస్కర్‌ను కలిసి తనకు సినిమా అవకాశం అవసరం లేదని, కానీ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి ఆ మెయిల్ తనకు ఇవ్వాలని కోరారట. తరుణ్ భాస్కర్ ఆయన మాటలను నమ్మి ఆ మెయిల్ పంపించడంతో కేవలం 24 గంటల్లోనే అది నకిలీ వ్యవహారమని బయటపడిందని విశ్వక్ వెల్లడించారు. ఆ సమయంలో తరుణ్ తనను నమ్మకపోయి ఉంటే తన జీవితం ఎలా ఉండేదో ఊహించలేనని అన్నారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుతూ..తల్లిదండ్రులు, అక్క తనకు సగం సంస్కారాన్ని నేర్పిస్తే.. మిగిలిన సగం తరుణ్‌ నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు..జీవితంలో కిందపడిపోతున్న సమయంలో తనను కాలర్ పట్టుకుని పైకి లాగిన వ్యక్తి తరుణ్ భాస్కరేనని, ఆయన తనకు రక్తసంబంధం లాంటి సోదరుడని భావోద్వేగానికి గురయ్యారు..!!

satvika veeravalli about her running comparison with mahesh babu!

Satvika Veeravalli about her running comparison with Mahesh Babu

Director Tharun Bhascker gives Mass Warning Speech!

Director Tharun Bhascker gives Mass Warning Speech