in

Ramayana Box Office: Nitesh Tiwari’s Rare ₹1,500 Crore Record

nitish tiwari box office movie records

భారతీయ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలోనే కాకుండా, ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను వెండితెరపై ఆవిష్కరించడంలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం విశేషం. తాజాగా ‘రామాయణం’ సినిమాతో ఆయన పేరు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు నితేశ్ తివారీ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన ‘దంగల్’ మూవీ తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నారు.

హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ తీసుకొని తీసిన ఈ చిత్రం అప్పట్లో మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డు క్రియేట్ చేసింది..ఇప్పుడు ‘రామాయణం’ సినిమాతో మరోసారి అదే స్థాయి విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాలు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా నితేశ్ తివారీ నిలిచారు. ఇక ‘రామాయణం’ సినిమా విషయానికి వస్తే.. భారతీయ ఇతిహాసం ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ యుద్ధ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని కథనం పేర్కొంది.

ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు, నటీనటుల అభినయం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుండటంతో కలెక్షన్లు భారీగా నమోదవుతున్నాయి. నితేశ్ తివారీ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో జన్మించారు. ఐఐటీ బాంబేలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన, మొదట్లో అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేశారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ళ కింద 2011లో ‘చిల్లర్ పార్టీ’ అనే హిందీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తరువాత ‘భూత్‌నాథ్ రిటర్న్స్’, ‘దంగల్’, ‘ఛిచోరే’, ‘బవాల్’ లాంటి మంచి చిత్రాలను తీశారు.

ముఖ్యంగా ‘ఛిచోరే’ సినిమాకు ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు రావడం గొప్ప విషయం.. ఇలా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ, ఇప్పుడు ‘రామాయణం’తో మరోసారి వార్తల్లో నిలిచారు. వరుసగా భారీ విజయాలు అందుకుంటున్న ఆయన ఖాతాలో చేరిన ఈ అరుదైన రికార్డుపై సినీ అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా చూస్తే..ఒకవైపు ‘దంగల్’, మరోవైపు ‘రామాయణం’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడం నితేశ్ తివారీ కెరీర్‌లోనే ప్రత్యేకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.

Varanasi movie: SS Rajamouli with a poster of the film

SS Rajamouli And Mahesh Babu Varanasi Shoot Update!

Pawan Kalyan height: Pawan Kalyan walking on a riverbank in a white kurta, full length

Pawan Kalyan Height in Feet, cm and Inches: How Tall Is He?