in

Sai Pallavi’s Bold Short Hair Look for OM Movie!

Sai Pallavi’s Bold Short Hair Look for OM Movie!

Sai Pallavi's Bold Short Hair Look for OM Movie!

SOURCE —

Sai Pallavi’s Bold Short Hair Look for OM Movie!

As Posted On AP7AM website

సహజ నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయిపల్లవి, తన సినిమాల్లోని పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాలోనూ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ, సహజమైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ముఖ్యంగా పాత్ర కోసం ఎలాంటి మార్పులకైనా సిద్ధపడే ఆమె, తాజాగా తన తదుపరి సినిమా కోసం తీసుకున్న ఓ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సాయిపల్లవి ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరమ్: ది బ్లడ్ వుడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నిత్యా రెడ్డి అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్రకు మరింత సహజత్వం తీసుకురావడం కోసం తనకు ఎంతో ఇష్టమైన పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల బిహైండ్‌వుడ్స్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు.

సినిమా కథ విన్నప్పుడే తన పాత్ర స్వభావం, దాని ప్రాధాన్యత పూర్తిగా అర్థమయ్యాయని సాయిపల్లవి తెలిపారు. కథ తనకు ఎంతగానో నచ్చడంతో, ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పొడవాటి జుట్టును కత్తిరించుకోవడానికి ఏమాత్రం వెనుకాడలేదని వివరించారు. అయితే తన కొత్త లుక్‌ను చూసిన తర్వాత తల్లిదండ్రులు ఎలా స్పందించారో కూడా ఆమె సరదాగా వెల్లడించారు. మొదటగా వీడియో కాల్ ద్వారా తన తల్లికి కొత్త లుక్ చూపించగా, ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎన్నో ప్రశ్నలు అడిగారట. ఆ తర్వాత వెంటనే ఫోన్ కట్ చేశారని సాయిపల్లవి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఇక కొద్దిసేపటికే తన తండ్రి ఫోన్ చేసి, నిజంగానే జుట్టు కత్తిరించుకున్నావా? లేక విగ్ పెట్టుకున్నావా? అని అడిగారట.

సినిమా పాత్ర కోసమే ఈ మార్పు చేసుకున్నానని వివరించడంతో వారు క్రమంగా అలవాటు పడ్డారని తెలిపారు. మరోవైపు ఈ మేకోవర్ వెనుక ఉన్న ఆలోచనను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కూడా వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఐపీఎస్ అధికారి నిత్యా రెడ్డి పాత్రకు పొట్టి జుట్టు ఎంతో సహజంగా, సరిగ్గా సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజ జీవితంలో ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన మెరిన్ జోసెఫ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర లుక్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. పాత్ర కోసం సాయిపల్లవి చూపించిన అంకితభావం, కథపై ఆమెకు ఉన్న నమ్మకం వల్లే ఇలాంటి ప్రత్యేకమైన మేకోవర్ సాధ్యమైందని దర్శకుడు ప్రశంసించారు. మొత్తానికి తన అందమైన పొడవాటి జుట్టును సైతం పాత్ర కోసం త్యాగం చేసిన సాయిపల్లవి, మరోసారి తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను నిరూపించుకున్నారు. ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ అధికారిగా ఎలాంటి నటనతో ఆకట్టుకుంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

ALSO READ — Why Rashmika First Said No to Telugu Movie!

Vidya Balan Joins Balakrishna-Koratala Film!

Vidya Balan Joins Balakrishna-Koratala Film!