
SOURCE:-
Rashmika First Said No to Telugu Movie, As Posted on Website HMTV
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి రష్మిక మందన్న గురించి దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రష్మిక తెలుగు సినిమాల్లోకి రావడానికి మొదట్లో అంతగా ఆసక్తి చూపించలేదని, ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయడానికి తాను చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని ఆయన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం రష్మిక సాధిస్తున్న విజయాలను చూస్తుంటే, ఆమె టాలీవుడ్లో పెద్ద స్టార్ అవుతుందని అప్పుడే ఊహించానని వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు. దర్శకుడిగా వెంకీ కుడుములకు ‘ఛలో’ తొలి సినిమా. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి హీరోయిన్గా కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని ఆయన భావించారు.
ఆ సమయంలో కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ‘కిరిక్ పార్టీ’ సినిమాను చూసిన వెంకీ కుడుములకు అందులో రష్మిక నటన బాగా నచ్చింది. దీంతో ఆమెను సంప్రదించి ‘ఛలో’ సినిమాలో హీరోయిన్గా నటించాలని కోరారు. అయితే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రష్మిక మొదట్లో కొంత సంకోచించినట్లు ఆయన వెల్లడించారు. రష్మికను ఎలాగైనా ఈ సినిమాకు ఒప్పించాలని నిర్ణయించుకున్న వెంకీ కుడుముల, ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడి సినిమా గురించి వివరించారట. చివరకు వారి అంగీకారంతో రష్మిక ‘ఛలో’ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. నాగశౌర్యతో పాటు ఆయన తల్లిదండ్రులతో చర్చించిన తర్వాతే హీరోయిన్గా రష్మికను ఖరారు చేసినట్లు దర్శకుడు తెలిపారు. అంతేకాకుండా, ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సమయంలోనే భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుందని భావించి, రష్మిక టాలీవుడ్లో ‘నెక్స్ట్ బిగ్ థింగ్’ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టినట్లు గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం రష్మిక సాధిస్తున్న పాన్ ఇండియా విజయాలను చూస్తుంటే తన అంచనా నిజమైందని చెప్పవచ్చు. ‘ఛలో’తో మొదలైన ఆమె తెలుగు సినీ ప్రయాణం నేడు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవడం విశేషం. ఇక రష్మిక నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘మైసా’ గురించి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఆమె ఇప్పటివరకు కనిపించని విధంగా పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక గోండ్ తెగకు చెందిన యువతి పాత్రను పోషిస్తోంది. భావోద్వేగాలతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రష్మిక నటించిన అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నట్లు సమాచారం. నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది..!!
ALSO READ — Regina Cassandra: Karan Johar dropped me from Kesari 2 promotions
